34ºc, Sunny
Monday,22nd September, 2025
దేశవ్యాప్తంగా దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడలో తొలిరోజు అమ్మవారు గా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి నుంచి ఉ.4 గంటలకే అనుమతిస్తారు. అటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ఆదివారం ప్రారంభం కావడంతో దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భూమిపైకి ఏనుగు మీద వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈ ఆగమనం అత్యంత శుభప్రదమని అంటున్నారు. ‘అందువల్ల సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. దుర్గమ్మ తన భక్తులను కష్టాల నుంచి విముక్తి చేసి, సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. దీంతో మన జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి’ అని సూచిస్తున్నారు.
Fans
Fans
Fans
Fans